బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Rejects A Bollywood Movie Offer | Sakshi
Sakshi News home page

Dec 27 2018 2:16 PM | Updated on Jul 14 2019 1:11 PM

Vijay Devarakonda Rejects A Bollywood Movie Offer - Sakshi

అర్జున్‌ రెడ్డి సక్సెస్‌తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో ఉన్న ఈ క్రేజీ హీరో బాలీవుడ్ సినిమాలో ఆఫర్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. విజయ్‌ క్రేజ్‌ దృష్య్టా త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ కాయం అన్న ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌ కోసం విజయ్‌ దేవరకొండను సంప్రదించారట.

బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్ ప్రధాన పాత్రలో కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఆ జనరేషన్‌కు చెందిన ఓ క్రికెటర్‌ పాత్రకు విజయ్‌ను సంప్రదించారు. అయితే బాలీవుడ్ లో హీరోగానే ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్న విజయ్‌ క్యారెక్టర్‌ రోల్స్‌ చేయటం కరెక్ట్ కాదన్న ఆలోచనలో సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement