ఇంకా పూర్తి కాలేదు: విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda Promotional Video The Reality Behind Taxiwaala - Sakshi

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. చాలా రోజుల  క్రితమే రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే లోగా పూర్తి సినిమా లీకైపోయింది. మొబైల్స్‌లో టాక్సీవాలా సినిమా షేర్‌ అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై చిత్రయూనిట్ ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు.

తన సినిమాల ప్రమోషన్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే విజయ్‌ దేవరకొండ ఈ ప్రమోషనల్‌ వీడియోలోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే లీకైన వీడియోలో సినిమా రష్ మాత్రమే ఉందని.. ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్ పూర్తయితేనే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుందని ఇన్నోవేటివ్‌గా చూపించాడు. ‘ద రియాలిటీ బిహైండ్‌ టాక్సీవాలా’ పేరుతో రిలీజ్‌ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకుడు. విజయ్‌ సరసన ప్రియాంక జవాల్కర్‌, మాళవిక నాయర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top