వెంకీ.. విజయ్‌.. ఓ మల్టీస్టారర్‌!? | Vijay Devarakonda Next Movie Confirmed With Venkatesh | Sakshi
Sakshi News home page

వెంకీ.. విజయ్‌.. ఓ మల్టీస్టారర్‌!?

Sep 4 2017 12:42 AM | Updated on Sep 17 2017 6:20 PM

వెంకీ.. విజయ్‌.. ఓ మల్టీస్టారర్‌!?

వెంకీ.. విజయ్‌.. ఓ మల్టీస్టారర్‌!?

మల్టీస్టారర్స్‌ చేయడానికి వెంకటేశ్‌ ఎప్పుడూ సిద్ధమే.

మల్టీస్టారర్స్‌ చేయడానికి వెంకటేశ్‌ ఎప్పుడూ సిద్ధమే. అయితే... ఆయనకు కథ, అందులో పాత్రలు నచ్చాలి. మహేశ్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, రామ్‌తో ‘మసాలా’, పవన్‌కల్యాణ్‌తో ‘గోపాల గోపాల’ చేశారాయన. ఇప్పుడు వెంకటేశ్‌ ఓ మల్టీస్టారర్‌ అంగీకరించారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఇందులో మరో హీరోగా విజయ్‌ దేవరకొండ నటిస్తారట! ఈ సిన్మాకు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తారట.

వెంకీ, విజయ్‌... ఇద్దరూ ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ చెప్పిన కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని కొందరు చెబుతున్నారు. ఈ ఏడాది ఆఖరున లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కానున్న ఈ సినిమాను ‘రాక్‌లైన్‌’ వెంకటేశ్‌ నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ‘అర్జున్‌రెడ్డి’ కంటే ముందే విజయ్‌ దేవరకొండను సంప్రదించగా ‘యస్‌’ చెప్పారట! ప్రస్తుతం దర్శకుడు కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట. త్వరలో వివరాలన్నీ వెల్లడిస్తారేమో!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement