ముందు గెస్ట్‌గా? | Vijay Devarakonda going to Bollywood | Sakshi
Sakshi News home page

ముందు గెస్ట్‌గా?

Dec 18 2018 2:33 AM | Updated on Jul 14 2019 1:11 PM

Vijay Devarakonda going to Bollywood - Sakshi

విజయ్‌ దేవరకొండ

కొన్ని రోజులుగా విజయ్‌ దేవరకొండకు సంబంధించి ఒకే టాపిక్‌ గురించి డిస్కషన్‌ నడుస్తోంది. తన బాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడు? అన్నదే ఆ టాపిక్‌. జాన్వీ కపూర్‌తో చేసే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తారని, విజయ్‌ని కరణ్‌ జోహార్‌ పరిచయం చేస్తారని ప్రచారంలో ఉన్న వార్తలు. అయితే తాజాగా ‘83’ చిత్రం ద్వారా విజయ్‌ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తారని టాక్‌. 1983 క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఆధారంగా కబీర్‌ ఖాన్‌ రూపొందించనున్న చిత్రం ‘83’. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ కనిపించనున్నారు.

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సౌత్‌ ఇండియన్‌ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రను పోషిస్తారని టాక్‌. ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. ఇదే నిజమైతే బాలీవుడ్‌కి ముందు గెస్ట్‌గా వెళ్లి, ఆ తర్వాత హీరోగానూ చేస్తారని ఊహించవచ్చు. ప్రస్తుతం విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారాయన రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కే సన్నివేశాల్లో స్లిప్‌ అవ్వడంతో విజయ్‌ చేతికి చిన్నపాటి గాయమైంది.

Advertisement
 
Advertisement
Advertisement