యూఎస్‌లో దూసుకెళ్తోన్న ‘గీత గోవిందం’

Vijay Devarakonda Geetha Govindam Overseas Collections - Sakshi

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి పాత్రలో విజయ్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బోల్డ్‌, ఫుల్‌ యాటిట్యుడ్‌, అగ్రెసివ్‌గా నటించిన విజయ్‌.. ‘గీత గోవిందం’ సినిమాలో తన నటనా వైవిధ్యాన్ని చూపించాడు. సరదాగా, అమాయకంగా కనిపించే పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. 

పాజిటివ్‌ బజ్‌తో బుధవారం (ఆగస్టు 15) రిలీజైన గీతగోవిందం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విజయ్‌ నటనను మెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీ వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే యూస్‌లో హాఫ్‌ మిలియన్‌ డాలర్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. గోపిసుందర్‌ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఛలో ఫేమ్‌ రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటించింది. పరుశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top