బాలీవుడ్‌ సినిమాలపై ‘గోవిందుడి’ దెబ్బ | Vijay devarakonda Geetha Govindam Defeated Bollywood Movies In Australia | Sakshi
Sakshi News home page

Aug 20 2018 11:40 AM | Updated on Aug 20 2018 12:27 PM

Vijay devarakonda Geetha Govindam Defeated Bollywood Movies In Australia - Sakshi

ఆస్ట్రేలియాలో ‘గీత గోవిందం’ జోరు..

విజయ్‌ దేవరకొండ వరుస హిట్‌లతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. తాజాగా విడుదలైన గీత గోవిందం విజయ్ స్టార్‌డమ్‌ను పెంచేసింది. అర్జున్‌ రెడ్డిగా నటించిన విజయ్‌.. గోవిందుడిగానూ ప్రేక్షకులను మెప్పించేశాడు. వసూళ్లలో ఈ సినిమా రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘గీత గోవిందం’కు ఎదురులేకుండా పోయింది. కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఇక్కడే కాక ఓవర్సీస్‌లో కూడా దూసుకెళ్తోంది. అమెరికాలో ఇప్పటికే 1.5 మిలియన్‌ డాలర్లను కలెక్ట్‌ చేసింది. ఇక ఆస్ట్రేలియాలో పరిస్థితిని చూస్తే మాత్రం బాలీవుడ్‌కు నిద్ర పట్టేలా కనిపించడం లేదనిపిస్తోంది. అక్కడ గత వారం విడుదలైన గోల్డ్‌, సత్యమేవ జయతే సినిమాలు ‘గీత గోవిందం’ ధాటికి నిలబడలేకపోతున్నాయట. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘గోల్డ్’‌, జాన్‌ అబ్రహం హీరోగా వచ్చిన ‘సత్యమేవ జయతే’ సినిమాలు ఆస్ట్రేలియాలో ‘గీత గోవిందం’ జోరు చూసి ఖంగుతిన్నాయట. ఈ రెండు కలిసి 1.92లక్షల డాలర్లు వసూళ్లు చేయగా.. గీత గోవిందం మాత్రం  2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు చేసిందని ట్వీట్‌ చేశాడు. దీన్ని బట్టి చెప్పొచ్చు విజయ్‌ దేవరకొండ హవా ఏ రేంజ్‌లో ఉందో. పరుశురామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటించింది. 

Advertisement
 
Advertisement
Advertisement