‘గోవిందుడు’ మాములోడు కాదు!

Vijay Devarakonda Geetha Govindam Collected 75 Crore Gross - Sakshi

విజయ్‌ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో ఓవర్‌నైట్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేశాడు. ఈ చిత్రం విజయ్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఈ మూవీలో విజయ్ కల్ట్‌ అండ్‌ అగ్రెసివ్‌ నటనకు అందరూ ఫిదా అయ్యారు. 

తాజాగా విజయ్‌ తన ‘గీత గోవిందం’ సినిమాతో మళ్లీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. విజయ్ నటనలో అర్జున్‌ రెడ్డి చాయలను కనిపించకుండా ఈ చిత్రంలో ఒదిగిన తీరుకు విమర్శకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. సింపుల్‌ కథతో తెరకెక్కినా.. కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్‌ పరుశురామ్‌ విజయం సాధించాడు. 

ఈ సినిమాకు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన్న నటన మేజర్‌ ప్లస్‌. గోపి సుందర్‌ అందించిన సంగీతం చిత్రం విజయంలో పాలు పంచుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హీరోలకు కష్టమయ్యే ఫీట్‌ను అవలీలగా కొట్టేశాడు. యాభై కోట్ల క్లబ్‌లో చేరడానికి ఎంతో కష్టపడుతున్న హీరోలను వెనక్కినెట్టి ఈజీగా 75కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసేశాడు విజయ్‌. ఫుల్‌ రన్‌లో మరి ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top