పవర్‌ఫుల్‌ స్టూడెంట్‌ | vijay devarakonda dear comrade shootings in kakinada | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ స్టూడెంట్‌

Dec 29 2018 12:26 AM | Updated on Dec 29 2018 12:26 AM

vijay devarakonda dear comrade shootings in kakinada - Sakshi

విజయ్‌ దేవరకొండ

విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు విజయ్‌ దేవరకొండ. ఆ సమావేశం విశేషాలను వెండితెరపై తెలుసుకోవాలి. విజయ్‌ దేవరకొండ హీరోగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ‘ఫైట్‌ ఫర్‌ వాట్‌ యు లవ్‌’ అనేది ఉపశీర్షిక. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని ఈ సినిమాకు నిర్మాతలు. ఇందులో కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాకినాడలో ఈ సినిమా తాజా షెడ్యూల్‌ పూర్తయింది.

‘‘స్టూడెంట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎమోషనల్‌ డ్రామా మూవీ ఇది. ఇందులో సామాజిక బాధ్యత కలిగిన యువకుడి పాత్రలో విజయ్‌దేవర కొండ కనిపిస్తారు. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌ కంప్లీట్‌ చేశాం. సినిమాలో అతి పెద్దదైన కాకినాడ షెడ్యూల్‌ పూర్తయింది. మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇందులో పవర్‌ఫుల్‌ మెడికల్‌ స్టూడెంట్‌ పాత్రలో విజయ్, స్టూడెంట్‌ కమ్‌ క్రికెటర్‌ పాత్రలో రష్మిక కనిపిస్తారని టాక్‌. జస్టిస్‌ ప్రభాకరన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాకు కెమెరా: సుజిత్‌ సారంగ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement