ఈ కుర్రాడే ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్..! | Vijay devarakonda Childhood Photo Viral | Sakshi
Sakshi News home page

ఈ కుర్రాడే ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్..!

Aug 30 2017 12:05 PM | Updated on Sep 12 2017 1:23 AM

ఏమీ తెలియని అమాయకుడిలా కనిపిస్తున్న ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ కుర్రాడే హాట్ టాపిక్

ఏమీ తెలియని అమాయకుడిలా కనిపిస్తున్న ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ కుర్రాడే హాట్ టాపిక్.. అయితే ఇప్పుడు ఇలా లేడులెండి. పోస్టర్, టీజర్ ల నుంచే వివాదాలకు కారణమైన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ చిన్ననాటి ఫోటో ఇది. అర్జున్ రెడ్డి సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుండటంతో అందరి దృష్టి విజయ్ దేవరకొండ మీద పడింది.

దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో ఏ సందర్భంలో దిగిందన్న విషయం తెలియకపోయినా.. సినీ జనాలు ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోనే కాదు.. ఆడియో ఫంక్షన్ లోనూ బోల్డ్ కామెంట్స్ తో షాక్ ఇచ్చిన కుర్రాడు ఒకప్పుడు ఇంత అమాయకంగా కనిపించేవాడంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement