మెగాస్టార్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ?

Vijay Devara Konda In Megastar Chiranjeevi Lucifer Cinema - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ మెగాస్టార్‌ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత మెగాస్టార్‌ చిరంజీవి మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘లూసిఫర్‌’ చిత్రంలో నటించబోతున్నారు. సాహో డైరెక్టర్‌ సుజీత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో చేయాల్సిన పాత్ర కూడా వుంది. మలయాళ లూసిఫర్‌ చిత్రంలో  ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ ఆ పాత్రను పోషించారు. (లూసిఫర్‌కి విలన్‌?)

అయితే తెలుగులో మాత్రం మొదట్లో ఆ పాత్రకు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ రౌడీని సంప్రదించారని, అయితే దీనికి సంబంధించి విజయ్‌ ఇంకా ఏ విషయం ఫైనల్‌ చేయనట్లు  తెలుస్తోంది. ఇదిలా వుండగా, ఈ సినిమాలో ఆ పాత్ర షూటింగ్‌కు తక్కువ రోజులో అవసరమవుతాయి కాబట్టి విజయ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చని అంటున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం లూసిఫర్‌ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. (ముంబై కాదు... హైదరాబాద్‌లోనే!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top