విద్యావంతురాలు

Vidya Balan on Shakuntala Devi biopic - Sakshi

విద్యాబాలన్‌ ఈ మధ్య వరుసగా విద్యావంతురాలి పాత్రల్లోనే కనిపిస్తున్నారు. ‘మిషన్‌ మంగళ్‌’లో ఇస్రో శాస్త్రవేత్తగా కనిపించిన విద్యా, ప్రస్తుతం ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ అనే పేరు పొందిన గణిత ప్రావీణురాలు శకుంతలా దేవి బయోపిక్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. అను మీనన్‌ దర్శకురాలు. ఈ సినిమాలో తన లుక్‌ గురించి విద్యాబాలన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ పాత్రలో బాబ్డ్‌ హెయిర్‌ కట్‌లో కనిపిస్తాను. నా సౌతిండియన్‌ ఫేస్‌ కట్‌ ఈ మ్యాథ్స్‌ జీనియస్‌కు బాగా మ్యాచ్‌ అవుతుందనుకుంటున్నాను. శకుంతలగారి 20 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వయసు వరకు అన్ని లుక్స్‌లో కనిపిస్తాను’’ అన్నారు. ఇదే కాకుండా ఇందిరాగాంధీ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు విద్యా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top