విద్యాబాలన్‌ క్షేమం | Vidya Balan meets with a Road accident, escapes unhurt | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు తప్పిన ముప్పు

Sep 29 2017 11:52 AM | Updated on Aug 30 2018 4:15 PM

Vidya_Balan - Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని ​‘డీఎన్‌ఏ’  పత్రిక వెల్లడించింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బాంద్రా వెళుతుండగా ఆమె కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యాబాలన్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. కారు మాత్రం బాగా దెబ్బతింది. ‘విద్యాబాలన్‌ సురక్షితంగా ఉన్నారు. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడలేద’ని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

38 ఏళ్ల విద్యాబాలన్ తాజాగా నటించిన ‘తుమ్హారీ సులూ’  విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో ఆమె బిజీగా ఉన్నారు. ఇందులో లేట్‌ నైట్‌ ఆర్‌.జె. (రేడియో జాకీ) సులోచన పాత్రలో విద్యాబాలన్‌ నటించారు. ఇంతకుముందు ‘లగే రహో మున్నాభాయ్‌’లో ఆర్‌.జె.గా ఆమె కనిపించారు. ‘తుమ్హారీ సులూ’ లో విద్యాబాలన్‌ తొలిసారిగా పూర్తి కామెడీ రోల్‌ చేశారు. ఈ సినిమాకు కామెడీ హైలైట్‌ అవుతుందని చిత్రబృందం తెలిపింది. నవంబర్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement