పాటల ‘వేట’ | Veta Movie Audio Launched | Sakshi
Sakshi News home page

పాటల ‘వేట’

Jan 10 2014 12:14 AM | Updated on Jul 12 2019 4:40 PM

పాటల ‘వేట’ - Sakshi

పాటల ‘వేట’

శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్‌లో అశోక్ అల్లె దర్శకత్వంలో సి.కల్యాణ్ సమర్పణలో సీవీరావు, శ్వేతలానా, వరుణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘వేట’.

 శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్‌లో అశోక్ అల్లె దర్శకత్వంలో సి.కల్యాణ్ సమర్పణలో సీవీరావు, శ్వేతలానా, వరుణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. ఈ సినిమా పాటల సీడీని హైదరాబాద్‌లో వెంకటేష్ ఆవిష్కరించి, తొలి ప్రతిని వీవీ వినాయక్‌కి అందించారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఈ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘నాకు, తరుణ్‌కి ఈ సినిమా పెద్ద పేరు తేవాలి’’ అన్నారు. శ్రీకాంత్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని తరుణ్ పేర్కొన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని డి.రామానాయుడు ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఎన్.శంకర్, చక్రి, పోకూరి బాబూరావు, తారకరత్న, తనీష్, సురేష్ కొండేటి, శివాజీరాజా తదితరులు మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement