సంపూ, వేణుమాధవ్ మాటామంతీ... | venumadhav talks with sampurnesh babu | Sakshi
Sakshi News home page

సంపూ, వేణుమాధవ్ మాటామంతీ...

May 20 2015 11:00 AM | Updated on Jul 25 2018 4:09 PM

సంపూ, వేణుమాధవ్ మాటామంతీ... - Sakshi

సంపూ, వేణుమాధవ్ మాటామంతీ...

మంచు మనోజ్  పెళ్లిలో హాస్యనటులు అంతా సందడి చేశారు. మాదాపూర్ హైటెక్స్లో మనోజ్-ప్రణతి వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ : మంచు మనోజ్ పెళ్లిలో హాస్యనటులు అంతా ఒక్కచోట చేరి.. కావల్సినంత సందడి చేశారు. మాదాపూర్ హైటెక్స్లో మనోజ్-ప్రణతి వివాహం బుధవారం నాడు వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాస్యనటులు వేణుమాధవ్, సంపూర్ణేశ్ బాబు, రఘుబాబు తదితరులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్, సంపూలు ముచ్చట్లు పెట్టారు. చాలాసేపు వాళ్లిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కనిపించింది.

 

దొంగాట సినిమాలో ఒక పాత్రలో సంపూర్ణేష్ బాబు నటించడంతో పాటు.. తాజాగా సంపు హీరోగా చేసిన 'సింగం 123' సినిమాకు కూడా మంచు విష్ణు నిర్మాత అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ విషయాలన్నింటినీ వేణు ప్రస్తావించి సంపుతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు. మరోవైపు వేణు మాధవ్తో ఫొటోలు దిగేందుకు పెళ్లికి వచ్చిన పలువురు చిన్నారులు ఉత్సాహం చూపారు.

Advertisement
 
Advertisement
Advertisement