మామా అల్లుళ్లు రెడీ! | venkymama regular shootings starts dec 12 | Sakshi
Sakshi News home page

మామా అల్లుళ్లు రెడీ!

Nov 30 2018 5:44 AM | Updated on Jul 23 2019 11:50 AM

venkymama regular shootings starts dec 12 - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య

రంగంలోకి దిగటానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు మామాఅల్లుళ్లు. ఇక మొదలుపెట్టడమే ఆలస్యం. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘వెంకీమామ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలనుకుంటున్నారు. ఇందులో రియల్‌లైఫ్‌లో మామాఅల్లుళ్లైన వెంకీ–చైతూ ఈ రీల్‌లైఫ్‌లోనూ అలానే కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌ 12న స్టార్ట్‌ కానుంది. డిసెంబర్‌ 13న వెంకటేశ్‌ పుట్టినరోజని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

‘వెంకీమామ’ తొలి షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్‌ చేశారని సమాచారం. ముందుగా షూటింగ్‌లో ఎవరు పాల్గొంటారు? వెంకీనా లేక చైతూనా? లేక కాంబినేషన్‌ సీన్స్‌ను ప్లాన్‌ చేశారా? అనే విషయాలు త్వరలో తెలుస్తాయి. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించనున్నారు. వెంకీ సరసన నటించే హీరోయిన్‌ కోసం కొందరి అగ్రకథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు టీమ్‌. మరో మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement