పూరి దర్శకత్వంలో వెంకీ..? | Venkateshh next film under Puri Jagannadh direction | Sakshi
Sakshi News home page

పూరి దర్శకత్వంలో వెంకీ..?

Dec 27 2016 11:13 AM | Updated on Sep 4 2017 11:44 PM

పూరి దర్శకత్వంలో వెంకీ..?

పూరి దర్శకత్వంలో వెంకీ..?

డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్, సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. టెంపర్ తరువాత పూరి తెరకెక్కించిన సినిమాలేవి, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవటంతో...

డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్, సీనియర్ స్టార్ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. టెంపర్ తరువాత పూరి తెరకెక్కించిన సినిమాలేవి, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోక పోవటంతో సీనియర్ హీరోల మీద దృష్టి పెట్టాడు. తన కెరీర్లో ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేసిన పూరి, నాగార్జున హీరోగా రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు మరోసారి సీనియర్ స్టార్ వెంటేష్తో సినిమాకు రెడీ అవుతున్నాడు.

బాబు బంగారంతో డీసెంట్ హిట్ అందుకున్న వెంకటేష్, ప్రస్తుతం రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా గురు రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయనున్నాడు. అదే సమయంలో పూరి సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వెంకీ.

Advertisement
 
Advertisement
Advertisement