బిచ్చగాడు డైరెక్టర్తో వెంకీ | Venkatesh to Work with Bichagadu Director shashi | Sakshi
Sakshi News home page

బిచ్చగాడు డైరెక్టర్తో వెంకీ

Aug 7 2016 10:16 AM | Updated on Sep 4 2017 8:17 AM

బిచ్చగాడు డైరెక్టర్తో వెంకీ

బిచ్చగాడు డైరెక్టర్తో వెంకీ

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు నాట కూడా సూపర్ హిట్గా నిలిచింది. దీంతో టాలీవుడ్ స్టార్...

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు నాట కూడా సూపర్ హిట్గా నిలిచింది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమా డైరెక్టర్ శశితో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. శశి కూడా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసే ఆలోచనతో ఓ సీనియర్ హీరోతో సినిమా చేసుందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం బాబు బంగారం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్ హీరో వెంకటేష్.. ఆ సినిమా తరువాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అదే సమయంలో బిచ్చగాడు దర్శకుడు శశితో కూడా సినిమా చేసే ప్లాన్లో ఉన్నాడు వెంకీ. ఇప్పటికే వెంకీకి కథ వినిపించిన శశి, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. డబ్బింగ్ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించిన శశి, స్ట్రయిట్ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement