తీన్‌మార్‌? | Venkatesh, Shriya Saran to star in Telugu remake Asuran | Sakshi
Sakshi News home page

తీన్‌మార్‌?

Nov 8 2019 3:28 AM | Updated on Nov 8 2019 3:28 AM

Venkatesh, Shriya Saran to star in Telugu remake Asuran - Sakshi

శ్రియ, వెంకటేశ్

‘సుభాష్‌ చంద్రబోస్, గోపాల గోపాల’ సినిమాల్లో జంటగా నటించారు వెంకటేశ్, శ్రియ. వెంకటేశ్‌ నటించిన ‘తులసి’ సినిమాలో ‘నే చికుబుకు బండినిరో..’ అనే స్పెషల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేశారు. ఇప్పుడు మూడోసారి వెంకటేశ్, శ్రియ జోడీ కడుతున్నట్టు తెలిసింది. ధనుష్‌ హీరోగా నటించిన తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘అసురన్‌’ని వెంకటేశ్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలోనే హీరోయిన్‌గా శ్రియ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది అధికారిక ప్రకటన రాలేదు. టీవీ యాంకర్, దర్శకుడు ఓంకార్‌ ఈ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కలైపులి యస్‌. థాను, సురేశ్‌బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement