రేసు నుంచి తప్పుకున్న వెంకీ..? | Venkatesh Guru for Republic Day | Sakshi
Sakshi News home page

రేసు నుంచి తప్పుకున్న వెంకీ..?

Nov 5 2016 10:51 AM | Updated on Sep 4 2017 7:17 PM

రేసు నుంచి తప్పుకున్న వెంకీ..?

రేసు నుంచి తప్పుకున్న వెంకీ..?

ఈ సంక్రాంతికి నలుగురు సీనియర్ హీరోలు ఒకేసారి బరిలో దిగుతారని భావించినా.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. చాలా కాలం తరువాత నలుగురు అగ్ర కథానాయకులు ప్రస్టీజియస్...

ఈ సంక్రాంతికి నలుగురు సీనియర్ హీరోలు ఒకేసారి బరిలో దిగుతారని భావించినా.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. చాలా కాలం తరువాత నలుగురు అగ్ర కథానాయకులు ప్రస్టీజియస్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాదు ఈ నలుగురు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారన్న వార్తలతో అభిమానులు కూడా తెగ సంబర పడిపోయారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు.

ఓంనమో వేంకటేశాయ పేరుతో భక్తి రస చిత్రంలో నటిస్తున్న నాగార్జున ముందుగా రేసు నుంచి తప్పుకున్నాడు. భారీ గ్రాఫిక్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావద్దన్న ఉద్దేశంతో వాయిదా వేసుకున్నాడు. తాజాగా మరో హీరో వెంకటేష్ కూడా డేట్ మార్చుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్న వెంకీ ముందుగా పండుగ రోజు థియేటర్లలోకి రావాలని ప్లాన్ చేసుకున్నాడు.

అయితే తాజాగా వెంకీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వెంకీ బాక్సింగ్ ట్రైనర్గా నటిస్తున్న గురు సినిమాను రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. దీంతో సంక్రాంతి బరిలో చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150తో పాటు బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణిలు మాత్రమే పోటి పడనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement