కామెడీ డోస్‌ డబుల్‌ | Venkatesh begins shooting for Anil Ravipudi's F2 | Sakshi
Sakshi News home page

కామెడీ డోస్‌ డబుల్‌

Jul 10 2018 12:34 AM | Updated on Jul 10 2018 12:34 AM

Venkatesh begins shooting for Anil Ravipudi's F2 - Sakshi

వెంకటేశ్, శిరీష్, అనిల్‌ రావిపూడి

ఇక నుంచి ఫన్‌ డబులవ్వనుంది. కామెడీ డోస్‌ రెండింతలు కానుంది. ఎందుకంటే వెంకటేశ్‌ సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి. ఈ ఫన్‌ రైడ్‌లో ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు అనిల్‌ రావిపూడి.  వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 2’ అనే మల్టీస్టారర్‌ రూపొందుతోంది. వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్‌ తేజ్‌ సరసన మెహరీన్‌ యాక్ట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’రాజు నిర్మిస్తున్నారు.

ఇటీవల స్టార్ట్‌ అయిన ఈ షూటింగ్‌లో ఆల్రెడీ వరుణ్, మెహరీన్‌ జాయిన్‌ అయ్యారు. లేటెస్ట్‌గా వెంకటేశ్‌ కూడా ఎంట్రీ ఇచ్చి డబుల్‌ ఫన్‌ సృష్టించనున్నారు. ‘‘ఈరోజు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఇవాళ (సోమవారం) వెంకటేశ్‌గారు షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఫస్ట్‌ టైమ్‌ వెంకటేశ్‌గారితో వర్క్‌ చేయడం హానర్‌గా ఫీల్‌ అవుతున్నాను’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Advertisement
 
Advertisement
Advertisement