వీరుడొక్కడే... | Veeram will be titled Veerudokkade in Telugu | Sakshi
Sakshi News home page

వీరుడొక్కడే...

Dec 31 2013 12:11 AM | Updated on Sep 2 2017 2:07 AM

అజిత్, తమన్నా

అజిత్, తమన్నా

అజిత్, తమన్నా కాంబినేషన్‌లో తమిళంలో ‘వీరం’ చిత్రం రూపొందుతోంది. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్రామిరెడ్డి

అజిత్, తమన్నా కాంబినేషన్‌లో తమిళంలో ‘వీరం’ చిత్రం రూపొందుతోంది. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల్ని ఓమిక్స్ క్రియేషన్స్ సంస్థ చేజిక్కించుకుంది. ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. నిర్మాత డా.శ్రీనుబాబు .జి మాట్లాడుతూ -‘‘చాలా గట్టి పోటీలో ఈ హక్కుల్ని మేం సొంతం చేసుకున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అజిత్, తమన్నాపై స్విట్జర్లాండ్‌లో తీసిన పాటలు లవ్లీగా వచ్చాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రాజమండ్రి, అరకులోయ, ఆర్‌ఎఫ్‌సీల్లో కూడా చిత్రీకరణ చేశారు. ముఖ్యంగా అరకులో 15 రోజులు తీసిన ట్రెయిన్ ఫైట్ ఈ చిత్రానికి హైలైట్. జనవరి మొదటి వారంలో పాటలు, చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement