క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘వీర భోగ వసంత రాయలు’ | Veera Bhoga Vasantha Rayalu Movie Trailer | Sakshi
Sakshi News home page

Oct 16 2018 10:29 AM | Updated on Oct 16 2018 11:57 AM

Veera Bhoga Vasantha Rayalu Movie Trailer - Sakshi

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రమోషన్‌ను ప్రారం‍భించారు చిత్రయూనిట్‌. సినిమాలోని ప్రధాన పాత్రల ఫస్ట్‌లుక్స్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన యూనిట్ తరువాత టీజర్‌తో ఆకట్టుకున్నారు.

తాజా గా సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కిడ్నాప్‌, ఫ్లైట్‌ హైజాక్‌ లాంటి సీన్స్‌ తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా రెడీ చేశారు. నారా రోహిత్, సుధీర్‌ బాబు, శ్రియలు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తులుగా కనిపిస్తుండగా శ్రీ విష్ణు డిఫరెంట్‌ లుక్‌లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement