లుక్‌ లుక్‌.. న్యూ లుక్‌ | Veera Bhoga Vasantha Rayalu look release | Sakshi
Sakshi News home page

లుక్‌ లుక్‌.. న్యూ లుక్‌

Jul 21 2018 12:46 AM | Updated on Aug 29 2018 3:53 PM

Veera Bhoga Vasantha Rayalu look release - Sakshi

ఇక్కడున్న శ్రియ ఫొటోని చూశారా? రఫ్‌గా కనిపిస్తున్నారు కదా. లుక్‌ చూస్తుంటే ఇప్పటివరకూ చేయనటువంటి డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశారనిపిస్తోంది.  ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రంలోనే శ్రియ ఇలా కనిపించనున్నారు. నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్‌ బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా ఇంద్రసేన ఆర్‌. దర్శకత్వంలో బాబా క్రియేషన్స్‌ పతాకంపై అప్పారావ్‌ బెళ్ళన  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రియ లుక్‌ని నారా రోహిత్‌ శుక్రవారం విడుదల చేసారు. ఆమె లుక్‌ చూసి ‘వావ్‌ .. వాట్‌ ఎ లుక్‌’ అంటున్నారు సినీ ప్రేమికులు, శ్రియ అభిమానులు. క్రైమ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాసరెడ్డి, మనోజ్‌ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్‌ నేని, చరిత్‌ మానస్, స్నేహిత్‌ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె.రాబిన్, కెమెరా: ఎస్‌. వెంకట్‌.

Advertisement
 
Advertisement
Advertisement