కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్ | Varun Tej Movie with Venky atluri, Bvsn Prasad | Sakshi
Sakshi News home page

కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్

Dec 27 2016 12:19 PM | Updated on Sep 4 2017 11:44 PM

కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్

కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్

మెగా వారసుడు వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న వరుణ్ ఆ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో

మెగా వారసుడు వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న వరుణ్ ఆ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగాను మరో సినిమాను ఫైనల్ చేశాడు. క్లాస్ మాస్ అనే ఇమేజ్లకు దూరంగా అన్ని రకాల సినిమాలు చేస్తున్న వరుణ్ త్వరలో కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు.

ఇటీవల కాలిగాయంతో చాలా కాలం పాటు ఇంటికే పరిమితమైన మెగా ప్రిన్స్ ఇప్పుడు త్వరగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందుకే మిస్టర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి అదే స్పీడు ఫిదా సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమా షూటింగ్లో పాల్గొంటాడు వరుణ్.

Advertisement
 
Advertisement
Advertisement