కార్తికేయ డైరెక్టర్తో వరుణ్ | Varun Tej in Chandu Mondetis thriller | Sakshi
Sakshi News home page

కార్తికేయ డైరెక్టర్తో వరుణ్

Aug 14 2016 8:49 AM | Updated on Sep 4 2017 9:17 AM

కార్తికేయ డైరెక్టర్తో వరుణ్

కార్తికేయ డైరెక్టర్తో వరుణ్

మెగా వారసుడు వరుణ్ తేజ్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టిన వరుణ్ ఇప్పుడు మూడో సినిమాను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో...

మెగా వారసుడు వరుణ్ తేజ్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టిన వరుణ్ ఇప్పుడు మూడో సినిమాను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాతో పాటు, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్.

తాజాగా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమా రెడీ అవుతున్నాడట. కార్తీకేయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూ, ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ప్రేమమ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వరుణ్ హీరోగా ఓ మెడికల్ థ్రిల్లర్ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement