సోషల్‌ మీడియాను ఊపేసిన ‘జిమ్ జిమ్ తార’.. ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది! | Jim Jim Tara Lyrical Video Song Released From Parnashala After Goes Trending On Social Media, Watch Video Inside | Sakshi
Sakshi News home page

‘జిమ్ జిమ్ తార..జిమ్‌ జిమ్‌ తార’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Oct 13 2026 5:04 PM | Updated on Oct 13 2026 5:17 PM

Jim Jim Tara Lyrical Video Song Out From Parnashala

‘జిమ్ జిమ్ తార..జిమ్‌ జిమ్‌ తార..జిలేబీ తేరా చిన్నోడా’.. ఈ పాట గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.ఇప్పటికే ఈ సాంగ్‌పై సోషల్ మీడియాలో వేల కొద్దీ రీల్స్, మీమ్స్ పుట్టుకొచ్చాయి. అయితే అసలు విషయం ఏంటంటే.. ఈ పాట అధికారికంగా ఈ రోజు రిలీజ్‌ అయింది. ‘పర్ణశాల’ మూవీ కోసం జి.ల‌క్ష్మిదేవి రాసి పాడిన పాట ఇది. సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా..  చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ, “మా ప‌ర్ణ‌శాల సినిమా కోసం జి.ల‌క్ష్మిదేవి గారు రాసి పాడిన జిమ్ జిమ్ తార’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని కలిగిస్తోంది. పూర్తి పాట విడుదల త‌ర్వాత అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటను అధికారికంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరింత ఆనందంగా ఉంది. పూర్తి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

పూర్తి పాట అధికారికంగా విడుదల కాకముందే, దీనికి సంబంధించిన బాణీ, వీడియోలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పలువురు నెటిజన్లు ఈ పాటకు రీల్స్‌, వీడియోలు రూపొందిస్తుండగా, సెలబ్రిటీలు సైతం తమ కంటెంట్‌లో ఉపయోగించడం విశేషం.

ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత మంచి వెంకట్ నిర్మాణంలో వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే తన వినూత్న ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement