సగానికి దగ్గరగా!

Varun Tej and team wrap up a hectic schedule - Sakshi

అంతరిక్షంలోకి అడుగు పెట్టడానికి హీరో వరుణ్‌తేజ్‌ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మరి... ఆయన ప్రయాణం ఎంత వరకు వచ్చిందంటే ఆల్మోస్ట్‌ సగానికి దగ్గరగా వచ్చింది. తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది.

‘‘35రోజుల క్రేజీ షెడ్యూల్‌ను గ్రావిటీ ప్ల్రాబ్లమ్‌ లేకుండా కంప్లీట్‌ చేశాం. క్రియేటివిటీ కోసం హార్డ్‌ వర్క్‌ చేశాం. ఇదివరకెన్నడూ సిల్వర్‌స్క్రీన్‌పై చూడని విధంగా ఫిజికల్‌గా కూడా ఏదో అచీవ్‌ చేశామన్న ఫీలింగ్‌ ఉంది. గ్రేట్‌ టీమ్‌ ఎఫెర్ట్‌’’ అని పేర్కొన్నారు వరుణ్‌తేజ్‌. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో వరుణ్‌ యాక్షన్‌ సీన్స్‌ను డూప్‌ లేకుండా చేశారని చిత్రబృందం చెబుతోంది. సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top