ముందు మల్లు అర్జున్‌... ఇప్పుడు ‘ఫిదా’ వరుణ్‌! | Varun Tej And Sai Pallavi Tollywood Movie Fidaa Going To Remake | Sakshi
Sakshi News home page

ముందు మల్లు అర్జున్‌... ఇప్పుడు ‘ఫిదా’ వరుణ్‌!

Published Mon, Nov 13 2017 12:33 AM | Last Updated on Mon, Nov 13 2017 12:33 AM

Varun Tej And Sai Pallavi Tollywood Movie Fidaa Going To Remake - Sakshi

మలయాళంలో మంచి మార్కెట్‌ సంపాదించుకున్న యంగ్‌ తెలుగు హీరోలు ఎవరు? అంటే... అల్లు అర్జున్‌ పేరు ముందు వినిపిస్తుంది. ఇప్పుడు బన్నీ రూటులో మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌ వెళ్తున్నాడు. వరుణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన సినిమా ‘ఫిదా’. త్వరలో మలయాళంలో ఇదే పేరుతో సినిమాను విడుదల చేయనున్నారు. రీసెంట్‌గా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌. మలయాళ ‘ప్రేమమ్‌’తో సాయిపల్లవికి స్టార్‌ స్టేటస్‌ వచ్చింది.

నెక్ట్స్‌... శేఖర్‌ కమ్ముల ‘హ్యాపీడేస్‌’ కూడా మలయాళంలో మంచి హిట్‌! అందువల్ల, ‘సాయిపల్లవి ఈజ్‌ బ్యాక్‌’, ‘ఫ్రమ్‌ ద డైరెక్టర్‌ ఆఫ్‌ హ్యాపీడేస్‌’ పేరుతో మలయాళంలో పబ్లిసిటీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై మలయాళంలో సొంతంగా విడుదల చేయడానికి ‘దిల్‌’ రాజు సన్నాహాలు చేస్తున్నారట! బన్నీని మలయాళ ప్రేక్షకులు ముద్దుగా ‘మల్లు’ అర్జున్‌ అని పిలుచుకుంటారు. ఈ సినిమా మంచి హిట్టయితే వరుణ్‌తేజ్‌ను ‘ఫిదా వరుణ్‌’ అంటారేమో!! తెలుగులో 45 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసిందీ సినిమా. మలయాళంలో ఎంత కలెక్ట్‌ చేస్తుందో? వెయిట్‌ అండ్‌ సీ!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement