అక్కడ ‘జిగర్తాండ’.. ఇక్కడ ‘వాల్మీకి’

Varun Tej Act In Valmiki Which Is Remake To Jigarthanda - Sakshi

కోలీవుడ్‌లో ‘జిగర్తాండ’ మూవీ సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచే సరికి.. ఇక్కడ రీమేక్‌చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. బాలీవుడ్‌ దబాంగ్‌ మూవీని ఇక్కడి జనాలు మెచ్చే విధంగా రీమేక్‌(గబ్బర్‌ సింగ్‌) చేసి రికార్డులు సృష్టించిన హరీష్‌ శంకర్‌ ఈ మూవీని రీమేక్‌ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌.

‘ఎఫ్‌2’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన వరుణ్‌ తేజ్‌  ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తమిళ్‌ వర్షెన్‌లో ప్రతినాయకుడిగా బాబీ సింహా మెప్పించగా.. అదే పాత్రలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు  నిర్మాతలు తెలిపారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top