టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌ | varun multi starrer with daggubati rana | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌

Jan 1 2018 1:41 PM | Updated on Aug 11 2019 12:52 PM

varun multi starrer with daggubati rana - Sakshi

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాలు జోరందుకున్నాయి. అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలో విక్టరీ వెంకటేష్‌తో పాటు‌, నటిస్తున్న వరుణ్‌ తేజ్‌ తాజగా మరో మల్టీస్టారర్‌కు అంగీకరించినట్లు సమాచారం. వరుణ్, రానాతో కలిసి మరో మల్టీస్టారర్‌లో నటించడానికి అంగీకరించాడట.

ప్రముఖ తమిళ డైరెక్టర్‌ సాల్మన్‌ రాజ్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు జరుతున్నాయని, త్వరలోనే ఈచిత్రం సెట్స్‌పైకి వెల్లనుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుతం రానా ‘1945’ లో నటిస్తున్నాడు. తరువాత ‘హతి మేరే సాతి’ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇక వరుణ్‌ విషయానికి వస్తే వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తొలిప్రేమ’ షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement