కరణ్‌ న్యూలుక్‌.. హీరో కామెంట్‌! | Varun Dhawan Comments Over Karan Johar New Look | Sakshi
Sakshi News home page

కరణ్‌ న్యూలుక్‌.. హీరో కామెంట్‌!

Apr 25 2020 5:19 PM | Updated on Apr 25 2020 5:24 PM

Varun Dhawan Comments Over Karan Johar New Look - Sakshi

నెరిసిన జట్టుతో కరణ్‌ జోహార్‌

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్‌ జోహార్‌ న్యూలుక్‌పై ఆయన శ్రేయోభిలాషి, మిత్రుడు, బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఫన్నీ కామెంట్‌ చేశారు. కరణ్ న్యూలుక్‌ ఓ హాలీవుడ్‌ సినిమాలోని విలన్‌ను తలపిస్తోందని వరుణ్‌ అన్నారు. శుక్రవారం( ఏప్రిల్‌ 24 ) నాడు వరుణ్‌ ధావణ్‌ పుట్టిన రోజు సందర్భంగా కరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయనను పలకరించారు. శుభాకాంక్షలు తెలుపుతూ వరుణ్‌తో కాసేపు ముచ్చటించారు. కరణ్‌ మాటల సందర్భంగా‘‘ నేను మొదటిసారి నెరిసిన జుట్టుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నీతో చాట్‌ చేయటానికి వచ్చాను. అదీ నీ పుట్టిన రోజు కాబట్టి’’ అని అన్నారు.

దీనిపై స్పందించిన వరుణ్‌ ధావన్‘‘ నువ్వు జేమ్స్‌ బాండ్‌ సినిమాలో విలన్‌లాగా కనిపిస్తున్నావు’’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. అనంతరం కలర్‌ ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించగా.. ‘‘ మా పిల్లలు యశ్‌, రూహీలు నన్ను బుద్దా అని పిలుస్తున్నారు. అందుకే జుట్టుకు రంగువేసుకోకుండా వదిలేశా. దీనికి తోడు లాక్‌డౌన్‌ కారణంగా పిల్లలు, తల్లితో కలిసి ఇంట్లోనే ఉంటున్నాను. ఇక రసాయనాలనుంచి జుట్టుకు బ్రేక్‌ ఇద్దామని భావించా’’నని కరణ్‌ తెలిపారు.

చదవండి : క‌రోనా కాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన హీరో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement