జోరు పెరిగింది

Varalaxmi Sarathkumar romance with Raviteja in gopichand malineni - Sakshi

‘పందెంకోడి 2, సర్కార్‌’ వంటి తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో కీలకపాత్ర పోషించిన వరలక్ష్షీ్మ శరత్‌కుమార్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడామె డైరెక్ట్‌గా తెలుగు చిత్రాలకు సైన్‌ చేస్తూ టాలీవుడ్‌లో జోరు పెంచారు. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బి.మధు ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘రవితేజగారి సినిమాలో నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తారు. కాగా, సందీప్‌కిషన్‌ హీరోగా నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్‌’ వరలక్ష్మికి తొలి తెలుగు చిత్రం. తమిళంలో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఫుల్‌బిజీగా ఉన్నారామె.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top