ఆ టీజర్‌పై దర్శకుడి ప్రశంసలు 

Vamsi Paidipally Tweet About Nannu Dochukunduvate Teaser - Sakshi

సమ్మోహనంతో క్లాస్‌ హిట్‌ కొట్టి ఫామ్‌లోకి వచ్చారు సుధీర్‌ బాబు. సినిమాలోని తన నటనకు ప్రశంసులు దక్కాయి. హీరోగానే కాకుండా..నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెట్టారు సుధీర్‌ బాబు. సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్‌పై ‘నన్ను దోచుకుందువటేవ’ సినిమాను చేస్తున్నారు ఈ యంగ్‌హీరో. 

తాజాగా నన్ను దోచుకుందువటే సినిమా టీజర్‌ను రిలీజ్‌చేశారు. ఈ టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. సమ్మోహనం సినిమాలానే ఈ మూవీ కూడా విజయవంతం అయ్యేలా కనిపిస్తోంది. ఈ టీజర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ టీజర్‌పై దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందిస్తూ.. ‘ టీజర్‌ చాలా బాగుందిరా. సమ్మోహనం సినిమాలానే ఇది కూడా మళ్లీ హిట్‌ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. నిర్మాతగా సక్సెస్‌ సాధించాలి. ఆల్‌ ది బెస్ట్‌.’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top