విజయ్ హీరోగా హారర్ కామెడీ | Uv creations next with Vijay devarakonda | Sakshi
Sakshi News home page

విజయ్ హీరోగా హారర్ కామెడీ

Nov 19 2016 11:21 AM | Updated on Sep 4 2017 8:33 PM

విజయ్ హీరోగా హారర్ కామెడీ

విజయ్ హీరోగా హారర్ కామెడీ

ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలో హారర్ కామెడీల ట్రెండ్ నడుస్తోంది.

ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలో హారర్ కామెడీల ట్రెండ్ నడుస్తోంది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోలకు ఈ జానర్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. అందుకే దర్శకులు కూడా ఈ తరహా కథలతో సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకులు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా ఇదే జానర్లో సక్సెస్ అయ్యింది.

తాజాగా ఇదే జానర్లో మరో ఇంట్రస్టింగ్ సినిమా పట్టాలెక్కనుంది. సక్సెస్ఫుల్ బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం రిలీజ్కు రెడీగా ఉన్న ద్వారకతో పాటు మరో సినిమా  చేస్తున్న విజయ్, ఆ సినిమాలు పూర్తవ్వగానే యువి క్రియేషన్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement