లంకెబిందెల కోసం...

uttara movie released on jan 1 - Sakshi

శ్రీరామ్‌ నిమ్మల, కారుణ్య కత్రేన్‌ జంటగా తిరుపతి యస్‌.ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్తర’. శ్రీపతి గంగదాస్, తిరుపతి యస్‌.ఆర్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్‌ నిమ్మల మాట్లాడుతూ – ‘‘నాకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. నటనపై ఆసక్తితో హీరో కావాలని ప్రయత్నిస్తున్న నాకు ‘ఉత్తర’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో నా క్యారెక్టర్‌ చాలా సహజంగా ఉంటుంది.

తన కూతురు ఒకరిని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఓ తండ్రి కోపం తెచ్చుకోకుండా, తన కూతురి ప్రేమలోని తప్పు ఒప్పులను ఎలా చెప్పాడు? ఖాళీగా ఉన్న తన ప్రేమికుడిని ఓ అమ్మాయి ఎలా మార్చింది? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటాయి. సులభంగా ధనవంతులు కావడానికి యువత లంకెబిందెల కోసం చేసే ప్రయత్నాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. నాతో పోల్చుకున్నప్పుడు హీరోయిన్‌ కారుణ్యకు నటనాపరంగా అనుభవం ఉంది. ఆమెతో డ్యాన్స్‌ విషయంలో టెన్షన్‌ ఫీలయ్యాను కానీ యాక్టింగ్‌ని చాలా ఎంజాయ్‌ చేశాను. సినిమాని దర్శకుడు చాలా సహజంగా ఈ సినిమాను తెరకెక్కించాడు’’ అన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top