మహిళలకు అంకితం | uttara movie press meet | Sakshi
Sakshi News home page

మహిళలకు అంకితం

Jan 3 2020 2:36 AM | Updated on Jan 3 2020 2:36 AM

uttara movie press meet - Sakshi

నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్‌ జంటగా తిరుపతి యస్‌.ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉత్తర’. రవికుమార్‌ మాదారపు సమర్పణలో తిరుపతి యస్‌.ఆర్, శ్రీపతి గంగదాస్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. తిరుపతి యస్‌.ఆర్‌ మాట్లాడుతూ– ‘‘ఉత్తర’ అంటే ఒక అమ్మాయి. హీరోయిన్‌ పాత్ర కాదు. ‘ఉత్తర’ అనే అమ్మాయి కథను వెండితెరపై ప్రేక్షకులు తెలుసుకోవాలి. సహజమైన తెలంగాణ మాటలు, మనుషులను తెర మీదకు తీసుకువచ్చాం. సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరిలో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ సినిమాలో మహిళల రక్షణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాం. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. మహిళలకు  వంద శాతం నచ్చే చిత్రమిది. అందుకే వారికి అంకితం ఇస్తున్నాం. ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాను. అయినా ధైర్యంగా ముందుకు వెళ్లాం’’ అని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement