43 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్లో..! | Urmila Matondkars comeback is a special song | Sakshi
Sakshi News home page

43 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్లో..!

Jun 5 2017 12:45 PM | Updated on Sep 5 2017 12:53 PM

43 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్లో..!

43 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్లో..!

రంగీలా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హాట్ బ్యూటి ఊర్మిళ మతోండ్కర్. నార్త్ తో

రంగీలా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హాట్ బ్యూటి ఊర్మిళ మతోండ్కర్. నార్త్ తో పాటు సౌత్ లోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటి 2008 రిలీజ్ అయిన కర్జ్ సినిమా తరువాత సినీ రంగానికి దూరమైంది. అడపాదడపా టీవీ షోలతో పాటు మరాఠి సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటి, త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

అయితే సీనియర్ హీరోయిన్లందరూ తల్లి పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తుంటే ఊర్మిళ మాత్రం స్పెషల్ సాంగ్ తో రానుంది. 43 ఏళ్ల ఈ బ్యూటీ ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రైతా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. అభినయ్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement