సంక్రాంతికి సర్జికల్‌ స్ట్రయిక్స్‌

uri movie first look and teaser release - Sakshi

2016 సెప్టెంబర్‌ 18 తెల్లవారుజామున యూరీ పట్టణంలో బేస్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్న భారతీయ సైనికులపై ఉగ్రవాదులు ఓ మెరపుదాడి చేశారు. దీంతో 19మంది జవాన్లు మరణించారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత భారత సైన్యం పాకిస్తాన్‌పై (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం ప్రాంతంలో) సర్జికల్‌  స్ట్రయిక్స్‌ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంఘటనల ఆధారంగా హిందీలో ‘యూరీ: ది సర్జికల్‌ స్ట్రయిక్స్‌’ అనే సినిమా రూపొందుతోంది.

విక్కీ కౌశల్, పరేశ్‌ రావెల్, యామీ గౌతమ్‌ ముఖ్య తారలుగా నటించారు. ఆదిత్యా థార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అండ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఏడాది జనవరి 11న సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రాజీ, మన్‌మర్జియాన్‌ వంటి సినిమాల్లో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ వస్తున్న విక్కీ కౌశల్‌ ఇందులో మెయిన్‌లీడ్‌ రోల్‌ చేశారు. ఈ సినిమా చాలా ఉద్వేగభరింతగా ఉంటుందని యూనిట్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top