ఉపాసన అంటే చరణ్‌కు ఎంత ప్రేమో! | Upasana Tweet About Ram Charan | Sakshi
Sakshi News home page

Sep 23 2018 4:26 PM | Updated on Oct 22 2018 6:13 PM

Upasana Tweet About Ram Charan - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ కపుల్స్‌లో రామ్‌చరణ్‌-ఉపాసన జంట సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటుంది. చెర్రీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఉపాసన సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేస్తూ ఉంటుంది. రామ్‌చరణ్‌కు ట్విటర్‌ ఖాతా లేదనే విషయం తెలిసిందే. అందుకే చెర్రీ అభిమానులు అందరూ ఉపాసనను ట్విటర్‌లో ఫాలో అవుతుంటారు. 

తాజాగా చెర్రీ గురించి ఉపాసన చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చెర్రీ దగ్గరుండి మరీ తినిపిస్తున్నాడు.. కానీ, మళ్లీ జిమ్‌లో వర్కౌట్స్‌ చేయమని చంపేస్తాడంటూ బోరున ఏడుస్తున్న ఎమోజీలను ట్వీట్‌ చేసింది. ఈ సండే మిష్టర్‌ సీతో ఆనందంగా గడిచిందంటూ ట్వీట్‌ చేశారు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌ నిమిత్తం అజర్‌బైజాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని భావిస్తోంది చిత్రబృందం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement