ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి : ఉపాసన | Upasana Konidela Selling Her Clothes To Raise Funds For A Charity | Sakshi
Sakshi News home page

దటీజ్‌ ఉపాసన.. పేదల కోసం మంచి కార్యక్రమం

Mar 1 2020 8:59 PM | Updated on Mar 1 2020 8:59 PM

Upasana Konidela Selling Her Clothes To Raise Funds For A Charity - Sakshi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్‌పర్సన్‌  ఉపాసన మరోసారి తన మనసు చాటుకున్నారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఉపాసన.. తాజాగా పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. మనకు అవసరం లేనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఆమె. ఈ మేరకు తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధమవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. 

(చదవండి : ఈ వారం మాకెంతో స్పెషల్‌ : ఉపాసన)

‘నా వార్డ్ రోబ్ ను మొత్తం క్లీన్ చేశాక ఎంతో మానసిక ప్రశాంతత లభించింది. అయితే దానికి ఎంతో సమయం, ఎంతో శ్రమ ఖర్చైనా కష్టానికి తగ్గ ఫలితం లభించింది. నాకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడంలో ఎప్పుడూ దుబారా చేయను. చాలా జాగ్రత్తగా వస్తువులు కొంటుంటాను. అయినప్పటికీ కొన్ని దుస్తులను వార్డ్ రోబ్ నుంచి తీసేసి మూటకట్టాను. వాటిని చారిటీ సంస్థలకు నిధులు సేకరించేందుకు అమ్మేయాలని భావిస్తున్నాను. మరి ఎవరికి విరాళంగా ఇస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి’ అంటూ ఉపాసన ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement