రెండు కానుకలు! | Two gifts! | Sakshi
Sakshi News home page

రెండు కానుకలు!

Aug 22 2015 11:26 PM | Updated on Sep 3 2017 7:56 AM

రెండు కానుకలు!

రెండు కానుకలు!

ఒకప్పుడు నటీనటులు సినిమాలో తమపై వచ్చే పాటలను తామే పాడుకునేవాళ్లు. ఆ తర్వాత తర్వాత ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చేశారు. దాంతో నటీనటులు పాడటం మానేశారు.

ఒకప్పుడు నటీనటులు సినిమాలో తమపై వచ్చే పాటలను తామే పాడుకునేవాళ్లు. ఆ తర్వాత తర్వాత ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చేశారు. దాంతో నటీనటులు పాడటం మానేశారు. ఇప్పుడు మళ్లీ తారలు పాడే ట్రెండ్ మొదలైందని చెప్పాలి. హీరో, హీరోలు సరదాగా పాటలు పాడేస్తున్నారు.
 
 శ్రుతీ హాసన్, నిత్యామీనన్, ఆలియా భట్, శ్రద్ధా కపూర్, సోనాక్షీ సిన్హాలు ఇప్పటికే సింగర్స్‌గా తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఇప్పుడీ జాబితాలో ఐశ్వర్యా రాయ్ చేరనున్నారు. ‘జజ్బా’ చిత్రంతో ఐశ్వర్యా రాయ్ రీ-ఎంట్రీ కావడం అభిమానులకు ఓ మంచి కానుక. ఈ చిత్రం ద్వారా ఆమె మరో కానుక కూడా ఇవ్వనున్నారు.
 
 ఈ  చిత్రంతో ఆమె గాయని అవతారం ఎత్తనున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఓ పాటను ఐష్ పాడితే బాగుంటుం దని దర్శకుడు అడిగితే, ముందు ఊహూ అన్న ఆమె, తర్వాత ఓకే అన్నారు. ఈ పాటను త్వరలో రికార్డ్ చేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement