breaking news
playback singers
-
రెండు కానుకలు!
ఒకప్పుడు నటీనటులు సినిమాలో తమపై వచ్చే పాటలను తామే పాడుకునేవాళ్లు. ఆ తర్వాత తర్వాత ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చేశారు. దాంతో నటీనటులు పాడటం మానేశారు. ఇప్పుడు మళ్లీ తారలు పాడే ట్రెండ్ మొదలైందని చెప్పాలి. హీరో, హీరోలు సరదాగా పాటలు పాడేస్తున్నారు. శ్రుతీ హాసన్, నిత్యామీనన్, ఆలియా భట్, శ్రద్ధా కపూర్, సోనాక్షీ సిన్హాలు ఇప్పటికే సింగర్స్‌గా తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఇప్పుడీ జాబితాలో ఐశ్వర్యా రాయ్ చేరనున్నారు. ‘జజ్బా’ చిత్రంతో ఐశ్వర్యా రాయ్ రీ-ఎంట్రీ కావడం అభిమానులకు ఓ మంచి కానుక. ఈ చిత్రం ద్వారా ఆమె మరో కానుక కూడా ఇవ్వనున్నారు. ఈ చిత్రంతో ఆమె గాయని అవతారం ఎత్తనున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఓ పాటను ఐష్ పాడితే బాగుంటుం దని దర్శకుడు అడిగితే, ముందు ఊహూ అన్న ఆమె, తర్వాత ఓకే అన్నారు. ఈ పాటను త్వరలో రికార్డ్ చేయనున్నారు. -
ప్రియరాగాలే..
ప్లేబ్యాక్ పాడటం బాలీవుడ్ నటులకు కొత్తేమీ కాదు. తొలితరం న టీనటులు.. వారి పాటలకు వారే గొంతు సవరించుకున్నారు. ప్లేబ్యాక్ సింగర్స్ తరం మొదలయ్యాక కూడా అప్పుడప్పుడూ పాత్రధారులు.. స్వయం గాత్రదానం చేసుకున్నారు. వారి ఇన్స్పిరేషన్తో బ్యూటీక్వీన్ ప్రియాంక చోప్రా గళమెత్తనున్నారు. తన కోసం కాదండోయ్. ‘దిల్ ధడక్నే దో’ సినిమాలోని ఓ పాటలో అనుష్కశర్మ కోసం ప్రియాంక ప్లేబ్యాక్ సింగర్ అవతారం ఎత్తారు. ఆ పాటలో మాటలా వినిపించడమే కాదు.. ఆ సినిమాలో కూడా ప్రియాంక నటించారు. రణ్‌వీర్‌సింగ్, ఫరాన్ అక్తర్, అనిల్‌కపూర్ నటించిన ఈ చిత్రం జూన్ 5న బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది.