మా కెమిస్ట్రీ మొదట్లో వర్కవుట్ కాలేదు! | Trivikram on Nithin and Samantha chemistry! | Sakshi
Sakshi News home page

మా కెమిస్ట్రీ మొదట్లో వర్కవుట్ కాలేదు!

Jun 1 2016 12:41 AM | Updated on Sep 4 2017 1:21 AM

మా కెమిస్ట్రీ మొదట్లో వర్కవుట్ కాలేదు!

మా కెమిస్ట్రీ మొదట్లో వర్కవుట్ కాలేదు!

‘అ...ఆ’లో నేను అల్లరి చేస్తా. ఏ సమస్య వచ్చినా తడబడను. తొందరపాటు నిర్ణయాలు తీసేసుకునే అమ్మాయిగా కనిపిస్తాను...

‘‘ ‘అ...ఆ’లో నేను అల్లరి చేస్తా. ఏ సమస్య వచ్చినా తడబడను. తొందరపాటు నిర్ణయాలు తీసేసుకునే అమ్మాయిగా కనిపిస్తాను. నా రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే పాత్రను ఈ చిత్రంలో చేశాను. అలాగే ఎప్పుడూ లేనిది కామెడీ కూడా చేశాను. మామూలుగానే త్రివిక్రమ్‌గారికి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. అందుకే, ఈ పాత్ర విషయంలో నేను ఆయన్నే ఫాలో అయిపోయాను’’ అని కథానాయిక సమంత అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ‘అ..ఆ’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు...
 
* ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌కు తక్కువ ప్రాధాన్యం ఉండే సినిమాలే వస్తున్నాయి. పది సినిమాలు వస్తే అందులో ఒక్క సినిమాలో మాత్రమే హీరోయిన్ క్యారెక్టర్‌కు మంచి స్కోప్ ఉంటోంది. ఇలాంటి టైమ్‌లో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉన్న ‘అ..ఆ’లో నటించినందుకు ఆనందంగా ఉంది.

* నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నేను స్క్రిప్ట్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఒప్పుకుంటున్నాను. ‘అ..ఆ’కి డెరైక్టర్ త్రివిక్రమ్ అన్న ఒక్క కారణంతో ఈ సినిమాకి ఓకే చెప్పలేదు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్ర లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కొత్త కథతో ఈ సినిమా ఉంటుందని చెప్పను. కుటుంబ భావోద్వేగాల సమాహారంతో సాగే అద్భుతమైన ప్రేమకథ ఇది. త్రివిక్రమ్ సినిమాల్లో ఓ పూర్తి స్థాయి ప్రేమకథగా నిలిచిపోతుంది.

* నితిన్, నేనూ తొలిసారి కలిసి నటించాం. దాంతో ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పుడు మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. అది చూసి, మాతో సినిమా చేయాలా? వద్దా? అని త్రివిక్రమ్ కాస్త సందేహించారు. కానీ, వర్క్ చేయడం మొదలుపెట్టాక కెమిస్ట్రీ కుదిరింది.

* సినిమా చేసినా బాగా రావాలనే అనుకుంటాం. విజయం సాధించాలని ఆశిస్తాం. కానీ, అంతిమ ఫలితం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే చాలా బాధపడతా. ‘బ్రహ్మోత్సవం’ విషయంలో కూడా అలా అనుకోని రిజల్డ్ ఎదురయ్యేసరికి బాధపడ్డాను.

* ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్నాను. అంతే కాకుండా కన్నడ చిత్రం ‘యూటర్న్’ తెలుగు, తమిళ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement