నిన్నేపెళ్లాడతా | Trisha's reaction after watching FDFS 'Aranmanai 2' | Sakshi
Sakshi News home page

నిన్నేపెళ్లాడతా

Feb 7 2016 3:24 AM | Updated on Apr 3 2019 9:17 PM

నిన్నేపెళ్లాడతా - Sakshi

నిన్నేపెళ్లాడతా

ది మోస్ట్ బ్యాచి లర్ హీరోయిన్లలో నటి త్రిష ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో 13 వసంతాలు పూర్తి చేసుకున్న నటి త్రిష.

ది మోస్ట్ బ్యాచి లర్ హీరోయిన్లలో నటి త్రిష ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో 13 వసంతాలు పూర్తి చేసుకున్న నటి త్రిష. అయితే నేటికీ తను క్రేజీ హీరోయినే. నానాటికి తన అందాలను ఇనుమడింపజేసుకుంటున్న ఈ చెన్నై చిన్నది అదే విధంగా అవకాశాలను పెంచుకుంటున్నారు. మధ్య లో అవకాశాలు కాస్త చేజారినా ఎన్నై అరిందాల్ చిత్రం విజయం తరువాత అవకాశాలు వరుస కడుతున్నాయన్నది నిజం అయితే ఇప్పటి వరకూ గ్లామర్‌ను నమ్ముకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తనలోని అభినయాన్ని చాటడానికి సిద్ధమయ్యారు.

అలా ఇటీవల అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా భయపెట్టించారు. ఈ తరం నటీమణులు పత్రికల వారికి బేటీ ఇస్తున్నారో లేదో గానీ తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్‌చాట్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. పత్రికల వారి కొన్ని ప్రశ్నలకు బదులివ్వడానికి సంకట పడాల్సి వస్తుంది.అదే అభిమానులతో అయితే అలాంటి సమస్యలుండవు.  అందువల్ల తమ ప్రతి చిత్రం విడుదల సమయాల్లో హీరోయిన్లు తమ అభిమానులతో చాటింగ్ ఆసక్తి చూపిస్తున్నారు. అలా అరణ్మణై-2 చిత్ర విడుదల సందర్భంగా నటి త్రిష సోషల్ మీడియాలో అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

వారి ప్రశ్నలకు సావధానంగా సమాధానాలను చెప్పారు. ఏఏ హీరో గురించి త్రిష ఎలాంటి బదులిచ్చారో ఆమె మాటల్లోనే... సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని చాలా ఆసక్తిగా ఉంది. ఇక నటుడు అజిత్ నా ఆల్ టైమ్ అభిమాన రేట్ హీరో. ఆయనతో జత కట్టడానికి ఎప్పుడైనా రెడీ. విజయ్ నాకు స్పెషల్ నటుడు. శివకార్తికేయన్‌తో రొమాన్స్‌కు వెనుకాడను.  ధనుష్ గురించి చెప్పాలంటే కొన్ని పేజీలనే కేటాయించాలి. అంత ఉత్తమ నటుడాయన. అని తన భావాలను వెల్లడించిన త్రిషకు ఒక అభిమాని ఆమెను పెళ్లి చేసుకుంటాననే ఆఫర్ ఇచ్చారు. అందుకామె తనకిప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎస్కేప్ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement