అల్లు అర్జున్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన త్రిష‌ | Trisha Reveals Allu Arjun Secret Instagram Account | Sakshi
Sakshi News home page

ఇద్ద‌రు హీరోల‌తో వీడియో కాల్ మాట్లాడిన త్రిష‌

Mar 29 2020 3:27 PM | Updated on Mar 29 2020 5:42 PM

Trisha Reveals Allu Arjun Secret Instagram Account - Sakshi

క్ష‌ణం కూడా తీరిక లేకుండా గడిపే సినీన‌టులకు ఇప్పుడు కావాల్సినంత విరామం దొరికింది. దీంతో ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు త‌మత‌మ క‌ళ‌ల్ని బ‌య‌ట‌కు తీస్తూ దానికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ అభిమానుల‌తో కొంచెం ట‌చ్‌లో ఉంటున్నారు. తాజాగా హీరోయిన్ త్రిష త‌న ఇద్ద‌రు ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ మాట్లాడింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. స్వీయ నిర్భంధంలో ఉన్న నాకు ఇద్ద‌రు  ఫ్రెండ్స్ రానా ద‌గ్గుబాటి, అల్లు అర్జున్‌ మంచి కంపెనీ ఇచ్చార‌ని చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలో బ‌న్నీ సీక్రెట్‌ను బ‌య‌ట‌పెట్టేసింది. ఇన్‌స్టాలో 5.8 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్న బ‌న్నీ ఓ ప్రైవేట్ అకౌంట్‌ను న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

ఈ ప్రైవేట్ అకౌంట్‌ను కేవ‌లం 250 మంది ఫాలో అవుతుండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 744 పోస్టులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌లో అంతంత‌మాత్రం అవ‌కాశాలు ఉన్న ఈ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో రీఎంట్రీ ఇస్తుంద‌ని అంతా భావించారు. కానీ ఆ సినిమా నుంచి వైదొల‌గిన‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. కాగా రానా, త్రిష డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఎన్నో వార్తలు వెలువ‌డ్డాయి. దీనిపై ఓ కార్య‌క్ర‌మంలో స్పందించిన రానా ఆమెతో ఉన్న‌ అనుబంధం గురించి మాట్లాడుతూ.. త్రిష త‌న‌కు ద‌శాబ్ద కాలంగా మిత్రురాల‌ని పేర్కొన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement