కిడ్నాప్‌ చేసిందెవరు?

Trisha plays a doctor in 'Paramapadham Vilayattu' - Sakshi

పేషెంట్స్, నర్సులు, ఆపరేషన్లతో బిజీ బిజీగా ఉండాల్సిన డాక్టర్‌ ఎక్కడో హిల్‌ స్టేషన్‌లో రాత్రివేళలో కాళ్లూ చేతులు కట్టివేయబడి ఉన్నారు. చూస్తుంటే ఆ లేడీ డాక్టర్‌ను ఎవరో కిడ్నాప్‌ చేశారని అర్థం అవుతుంది. మరి.. ఈ కిడ్నాప్‌ వెనకాల ఉన్నది ఎవరు? అసలెందుకు కిడ్నాప్‌ చేశారనేది ‘పరమపదమ్‌ విలయాట్టు’ సినిమాలో తెలుస్తుంది. త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పరమపదమ్‌ విలయాట్టు’. తిరుజ్ఞానమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది.

ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో ఓ లేడీ డాక్టర్‌గా త్రిష కనిపిస్తారు. ఇందులో అదిరిపోయే యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉన్నాయట. నంద, రిచర్డ్, ఏఎల్‌ అళగప్పన్, వేలా రామ్మూర్తి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అమరేష్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, త్రిష ముఖ్య తారలుగా నటించిన లవ్‌స్టోరీ ‘96’ అక్టోబర్‌ 4న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top