సాహసాల సుందరి

Trisha Bungee Jump Pics Viral In Social Media At Canada Trip - Sakshi

తమిళసినిమా: సాధారణంగా మన హీరోయిన్లు విదేశాలు చుట్టిరావడానికి ఇష్టపడుతుంటారు. నటి త్రిష లాంటి వారైతే విదేశీయానానికి తరుచూ వెళ్లొస్తుంటారు. అయితే అలాంటి వారు చాలా మంది షాపింగ్‌లు, సముద్రతీరాన స్విమ్మింగ్‌లు చేస్తూ ఆ దృశ్యాలను వాట్సాప్, ట్విట్టర్‌ లాంటి సామాజిక మాద్యమాల్లో పోస్ట్‌ చేసి ప్రచారం పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చెన్నై చిన్నది త్రిష ఇందుకు విరుద్ధం అని చెప్పకతప్పదు. చేతి నిండా చిత్రాలు ఉన్నా, పార్టీలు, పబ్‌లు అంటూ జీవితాన్ని ఎంజాయ్‌ చేసే నటి త్రిష. ఈ అమ్మడు ప్రస్తుతం కెనడాలో ఎంజాయ్‌ చేస్తోంది. త్రిషకు కాస్త ధైర్యం ఎక్కువేనని చెప్పకతప్పదు. సినిమాల్లో హీరోలు బంగీ జంపు చేస్తుండడం చూస్తుంటాం. అందుకు వారు పలు జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే నిజంగానే అలాంటి సాహసమే చేసింది త్రిష. కెనడా దేశ రాజధాని టోరంటో నగరంలోని రోజర్‌ సెంటర్‌లో 1,168 అడుగుల ఎత్తైన ప్రదేశంలో బేస్‌బాల్‌ గేమ్‌ ఆడడానికి డిసైడ్‌ అయిపోయ్యింది. సాధారణంగా 20 అడుగులపై నుంచి కిందికి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది 1,168 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌ అంచున రోప్‌ సాయంతో 10 నిమిషాలు నిలబడి ఆ దృశ్యాలను ఫొటో తీసుకుని వాటిని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలిప్పుడు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అయి అభిమానుల్ని విపరీతంగా అలరిస్తున్నాయి. త్రిష ధైర్య, సాహసాల గురించి వారు ఒక రేంజ్‌లో పొగిడేస్తున్నారు. త్రిష బంగీ జంప్‌ చేసిందో లేదో గానీ, ఈ అమ్మడికి అంత సాహసం చేసినంత ప్రచారం లభించేసింది. ఈ విధంగా త్రిష మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం మోహిని త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. దీనితో పాటు గర్జన, 96, చతురంగవేట్టై–2, పరమపదం, 1818 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top