సెప్టెంబర్లో 'టచ్ చేసి చూడు' | Touch Chesi Chudu release on September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్లో 'టచ్ చేసి చూడు'

Jun 8 2017 3:44 PM | Updated on Sep 5 2017 1:07 PM

సెప్టెంబర్లో 'టచ్ చేసి చూడు'

సెప్టెంబర్లో 'టచ్ చేసి చూడు'

ఏడాదికి పైగా విరామం తీసుకున్న సీనియర్ స్టార్ రవితేజ, ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ సిరి

ఏడాదికి పైగా విరామం తీసుకున్న సీనియర్ స్టార్ రవితేజ, ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుడితో కలిసి టచ్ చేసి చూడుతో పాటు పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాల్లో నటిస్తున్నాడు. రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్న రవితేజ ముందుగా టచ్ చేసి చూడు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.  ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను సెప్టెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే సెప్టెంబర్ క్యాలెండర్ ఫుల్ బిజీగా ఉంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్ జై లవ కుశ ను సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు స్పైడర్ను సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాలకృష్ణ, పూరి జగన్నాథ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా సెప్టెంబర్ నెలాఖరున రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి ఇంత కాంపిటీషన్లో రవితేజ సినిమాకు గ్యాప్ దొరుకుతుందో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement