'మా ఆయన కోపాన్ని దాచేశాను' | Tori Spelling hid husbands temper on TV show | Sakshi
Sakshi News home page

'మా ఆయన కోపాన్ని దాచేశాను'

Jan 31 2016 10:30 AM | Updated on Sep 3 2017 4:42 PM

'మా ఆయన కోపాన్ని దాచేశాను'

'మా ఆయన కోపాన్ని దాచేశాను'

అమెరికాలో స్వీట్‌ హార్ట్ కపుల్‌గా పేరొందిన హాలీవుడ్ జంట టోరీ స్పెల్లింగ్, డీన్ మెక్‌డెర్మాట్స్‌.

లండన్‌: అమెరికాలో స్వీట్‌ హార్ట్ కపుల్‌గా పేరొందిన హాలీవుడ్ జంట టోరీ స్పెల్లింగ్, డీన్ మెక్‌డెర్మాట్స్‌. అన్యోన్యమైన అనుబంధమున్న ఈ దంపతులు ఇటీవల ఓ టీవీ రియాల్టీ షోలో కనిపించి.. చిలుకాగోరింకల్లా అభిమానులను అలరించారు. అయితే, ఈ టీవీ రియాల్టీ షోకు సంబంధించిన ఓ వాస్తవాన్ని ఇటీవల నటి టోరీ స్పెల్లింగ్ వెల్లడించింది. తన భర్త డీన్‌కు కోపమెక్కువని, అందుకే అతని కోపం ప్రేక్షకుల కంట పడకుండా రియాల్టీ షో వీడియోలను ఎడిటింగ్ చేయించానని ఆమె వెల్లడించింది.

'మేం అమెరికాలోనే అన్యోన్యమైన దంపతులం. మా ఆయన తరచూ కోప్పడుతుంటే అభిమానులు చూడటం అంతగా బాగుండదు. అందుకే ఆయన కోపాన్ని వారి కంటపడకుండా దాచేశాను' అని టోరీ వివరణ ఇచ్చింది. డీన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత తమ వైవాహిక జీవితం గురించి 'ట్రూ టోరీ' పేరిట ఆమె టీవీ రియాల్టీ షో చేశారు. అయితే, నిత్యం ప్రజాజీవితంలో ఉండే తమ గురించి కొన్ని వ్యక్తిగత విషయాలు ప్రజలకు తెలియడం అంత మంచిది కాదనే ఉద్దేశంతోనే తన భర్త కోపాన్ని కెమెరాకు చిక్కుకుండా జాగ్రత్తలు తీసుకున్నానని టోరీ పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement