తిరిగి స్వర్గానికి వెళ్లిపోయారు : ఎన్టీఆర్‌ | Tollywood Film Stars tweets after Sridevis death | Sakshi
Sakshi News home page

Feb 25 2018 8:15 AM | Updated on Feb 25 2018 8:15 AM

Tollywood Film Stars tweets after Sridevis death - Sakshi

శ్రీదేవి మృతి పట్ల టాలీవుడ్ స్టార్‌ హీరో ఎన్టీఆర్ స్పందించారు. పలు సందర్భాల్లో శ్రీదేవి మీద తన అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్ అవకాశం వస్తే ఆమెతో కలిసి నటించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు. ‘ఆమె వచ్చింది. ఆమె చూసింది. ఆమె గెలుచుకుంది. తిరిగి తను ఏ స్వర్గం నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్లిపోయింది. శ్రీదేవిగారి ఆత్మకు శాంతి కలగాని కోరుకుంటున్నా. ఆమె స్థానాన్ని భర్తీ చేయలేరు’ అంటూ ట్వీట్ చేశాడు.

హీరోయిన్‌ హన్సిక ‘నేను నమ్మలేకపోతున్నా. ఇది నిజం కాకూడదు. ఇంకా షాక్‌లోనే ఉన్నా. ఇది భారతీయ సినీ చరిత్రలోనే చీకటి రోజు. ఆమె లేని లోటును తెలియజేసేందుకు మాటలు సరిపోవటం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. యంగ్‌ హీరో నిఖిల్‌ ‘ఆమె లేదంటే నమ్మలేకపోతున్నా.. అందం అంటే ఎప్పటికీ శ్రీదేవిగారే. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సీనియర్‌ నటి ఖుష్బూ, మెహరీన్‌, కోన వెంకట్‌, హరీష్‌ శంకర్‌, సుమంత్‌, ప్రియమణి, హన్సిక, అనీల్‌ రావిపూడి,ఈషారెబ్బా తదితరులు తమ సంతాపం తెలియజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement